ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bengaluru: తెనాలి బాలికలకు గవర్నర్‌ ప్రశంసలు

ABN, First Publish Date - 2023-09-05T11:35:10+05:30

గుంటూరు జిల్లా తెనాలి(Guntur District Tenali)కి చెందిన బాలికలు కూచిపూడి నృత్యం(Kuchipudi dance)లో రాణించి గవర్నర్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తెనాలి(Guntur District Tenali)కి చెందిన బాలికలు కూచిపూడి నృత్యం(Kuchipudi dance)లో రాణించి గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌(Governor Thawar Chand Gehlot) ప్రశంసలు అందుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో గ్రీష్మశ్రీ (6), షేక్‌ తహసీన్‌ (11)లు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిం చారు. గవర్నర్‌ స్వయంగా తిలకించి అభినందించారు. కూచిపూడిని ప్రోత్సహించిన బాలికల తల్లిదండ్రులు సెవ్వా కృష్ణారెడ్డి, అరుణ కుమారి, షేక్‌ రఫీ, ఆలియాలను గవర్నర్‌ కొనియాడారు. శాస్త్రీయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. చిన్నారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయడంపై తల్లి దండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఎదుట కూడా గతంలో నృత్య ప్రదర్శనచేసి ప్రశంసలు అందుకున్నారన్నారు. కూచి పూడి నేర్పిన నాట్య గురువు నిర్మలా రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘మా ఎపి’ సభ్యులైన గ్రీష్మ, తహసీన్‌లు గవర్నర్‌ ప్రశంసలు పొందడంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసో సియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ 24 విభాగాల యూనియన్‌ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌ రాజా ప్రత్యేకంగా అభినందించారు. బాలికలు ఉన్నత శిఖరాలు అందుకోవాలనే అభిలాష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీన్‌ సోదరుడు తౌశిక్‌ కూడా ఉన్నారు.

Updated Date - 2023-09-05T11:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising