AP Politics : చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత
ABN, First Publish Date - 2023-09-06T21:28:59+05:30
గత కొన్నిరోజులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu) నాయుడిపై వస్తున్న వార్తలను ఏపీ బీజేపీ కీలక నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) స్పందించారు..
గత కొన్నిరోజులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu) నాయుడిపై వస్తున్న వార్తలను ఏపీ బీజేపీ కీలక నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) స్పందించారు. బుధావరం నాడు.. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కృష్ణాష్టమి (Krishnashtami) వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబుని కేంద్రం అరెస్టు చేసే అవకాశం లేదని తేల్చిచెప్పారు. అసలు ఐటీ కేసుకు (Chandrababu IT Case) సంబంధించి బాబును అరెస్ట్ చేయరన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనే చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
ధర్మ రక్షణ కోసం..
‘ధర్మ రక్షణ కోసం పాడుపడిన భగవంతుడు శ్రీ కృష్ణుడు. ధర్మ రక్షణ కోసం ఎందరో అసురులను సంహరించాడు. గతంలో దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయి. మన రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా కంటక పాలన సాగిస్తున్న వైసీపీని రాజకీయంగా సంహరించేందకు ప్రజలుముందుకు రావాలి. అభివృద్ధి పక్కన పెట్టి అవినీతిలో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు. మూడేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై ఇప్పుడే బయటకు వస్తున్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేస్తున్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారు. జగనన్న భూ రక్ష పేరిట పట్టా పుస్తకాలపై తన ఫొటో వేసుకున్నారు. తాను చేసే తప్పులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మోపాలని చూస్తున్నారు. ప్రజల ఆస్తులమీద కన్నేసి రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తెచ్చారు. గతంలో ఏ యుగంలో కూడా ఎవరూ వైసీపీ మాదిరిగా ప్రజా కంటక పాలన చేయలేదు’ అని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
ఏమిటీ పేరు కథ..!
‘మొన్నటి వరకూ భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ పేరు వద్దని అంటారా..?. భారతదేశానికి ఎంతో మంచి చరిత్ర ఉంది. వలస పాలకులు ఇండియా అని పేరు పెట్టారు. భారత్ అంటే నిరంతరం జ్ఞానం కోసం అన్వేషించటం. పేరు మార్చడం ఏమీ నేరం కాదు, గతంలో చాలా దేశాలు మార్చాయి. భారత్ అనేది నిషేధించిన పదం కాదు’ అని సత్యకుమార్ స్పష్టం చేశారు. మరోవైపు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో చంద్రబాబు పర్యటించారు. వైఎస్ జగన్ పాలనలో అన్నీ అరాచకాలే అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడీ జరిగిందని బాబు ఆరోపించారు.
YSRCP Vs TDP : పులివెందులో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్..
Updated Date - 2023-09-06T21:32:21+05:30 IST