ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somuveerraju: జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు సెటైర్లు

ABN, First Publish Date - 2023-05-19T13:10:01+05:30

జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సెటైర్లు విసిరారు. గన్నవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అరాచక‌ పాలన, అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జిషీట్ దాఖలైందని, ప్రతి‌చోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి జగన్2పై ఫిర్యాదు చేశారని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ ప్రభుత్వంపై (Jagan Government) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (BJP Leader Somuveerraju) సెటైర్లు విసిరారు. గన్నవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అరాచక‌ పాలన, అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జిషీట్ దాఖలైందని, ప్రతి‌చోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి జగన్2పై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ చార్జిషీట్ సమావేశాల సమూహాన్ని పుస్తకం రూపంలో తెస్తామన్నారు. సెంటు భూమి పేరుతో భూముల కొనుగోళ్లల్లో‌ గోల్‌మాల్ చేశారన్నారు. ఎకరం ఆరు లక్షలు ఉంటే 18 లక్షలకు కొనడం‌ ఒక‌ వింత అని అన్నారు. దున్నపోతు మీద వర్షం పడిన చందంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా ఇన్సూరెన్స్ చేయకుండా రైతులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. కనీసం గోనె సంచులను కూడా రైతులకు ఇవ్వడం లేదన్నారు. రైతులను మోసం చేస్తూ, మిల్లర్లకు ఈ‌ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆయన అన్నారు.

రైతు భరోసా కేంద్రాలు కాదని... రైతు దోపిడీ కేంద్రాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విషయంలో పేదల పొట్ట కొట్టారని.. లక్షలాది మంది కష్టాలు, కన్నీళ్లు జగన్‌కు పట్టవన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్ముకుంటూ క్యాష్ అండ్ క్యారీ‌ బిజినెస్ చేస్తుందన్నారు. ఈ డబ్బంతా ఎక్కడకి పోతుంది.. ఎవరి దగ్గరకు‌ చేరుతుందని ప్రశ్నించారు. నిన్న సీఎం సీఆర్డీఏ పరిధిలో పేదల‌ ఇళ్ల నిర్మాణం పూర్తి వేగంగా జరగాలని అంటారని.. కేంద్రం కేటాయించిన 22 లక్షల ఇళ్లు ఎందుకు కట్టలేదని నిలదీవారు. ‘‘ఐదు లక్షల‌ ఇళ్లు పూర్తి చేసే దమ్ము నీకు లేదు.. నీకు సీఆర్డీఏ పరిధిలో ఉన్న తొందర.. రాష్ట్రంలో‌ పేదల‌ పట్ట లేదా?.. యనభై, తొంభై శాతం పూర్తైయన టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేక పోయారు. ఈ‌వ ర్గ విబేధాలు ఎందుకు... పేదలపై మీ రాజకీయ పెత్తనం ఏమిటి. అవినీతి, దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. మే 30 నుంచి జూన్ 30 వరకు మోడీ నీతి, జగన్ అవినీతిని ప్రజలకు‌ వివరిస్తాం’’ అని సోమువీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-19T13:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising