Purandeswari: ఏపీ మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించండి
ABN, First Publish Date - 2023-10-08T19:17:15+05:30
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) భేటీ అయ్యారు.
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) భేటీ అయ్యారు. రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు పురందేశ్వరి తెలిపారు. నాలుగున్నర ఏళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, ప్రభుత్వం అనుసరించిన విధానం తదితర విషయాలపై కేంద్ర హోంమంత్రికి వినతి పత్రం అందజేసినట్లు పురందేశ్వరి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-08T19:20:19+05:30 IST