ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budha Venkanna: కేశినేని వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-06-09T10:53:43+05:30

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ సారి వైఎస్సార్ పైనుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ సారి వైఎస్సార్ పైనుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇది అర్ధమవటంతో ఇక గుడివాడ పర్యటన అనవసరం అనుకున్నారన్నారు.

అవినాష్ రెడ్డి అరెస్టుపై సీబీఐ డొంకతిరుగుడు వైఖరి సరికాదని బుద్దా వెంకన్న హితవు పలికారు. వైసీపీ గొట్టంగాళ్లంతా టీడీపీ చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారన్నారు. సునీతా రెడ్డి పులివెందుల పులి అని... జగన్మోహన్ రెడ్డి పిల్లి మాత్రమేనని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. తనను ఎవరేం విమర్శించినా తొందరపడనిని చంద్రబాబుకు మాటిచ్చానన్నారు. కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించబోనన్నారు. తన మాటలు పార్టీకి నష్టం చేకూర్చకూడదనే తాను మాట్లాడటం లేదన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

Updated Date - 2023-06-09T10:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising