ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : ఏపీకి పోలవరం జీవనాడి.. శని పోతే తప్ప ఆ కల సాకారం కాదు

ABN, First Publish Date - 2023-07-28T13:41:10+05:30

పోలవరం తరతరాల ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం రాష్ట్రానికి ఓ వరమన్నారు. పోలవరానికి జగనే శని అని.. అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదన్నారు.

అమరావతి : పోలవరం తరతరాల ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం రాష్ట్రానికి ఓ వరమన్నారు. పోలవరానికి జగనే శని అని.. అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదన్నారు. పోలవరం పూర్తైతే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లివ్వొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. లక్షల ఎకరాల్లో పంటలకు, పరిశ్రమల అవసరాలకు నీటి సౌకర్యం కల్పించవచ్చన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అని చంద్రబాబు కొనియాడారు. పోలవరం పునరావాసానికి టీడీపీ హయాంలో రూ. 4114 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం రూ. 1890 కోట్లే ఖర్చు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ. 19 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. పరిహారం ఇవ్వకపోగా లబ్దిదారుల జాబితా మార్చి అవకతవకలకు పాల్పడ్డారన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే పోలవరం పనులను నిలిపేసిన ఘనత జగన్‌దేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సుమారు 15 నెలల పాటు పోలవరం వద్ద ఎలాంటి నిర్మాణ సంస్థే లేకుండా చేశారన్నారు. కాంట్రాక్టరును మార్చొద్దని పీపీఏ చెప్పినా జగన్ వినలేదన్నారు. పీపీఏ స్పష్టంగా చెప్పినా మూర్ఖుడు కాంట్రాక్టరును మార్చారని చంద్రబాబు విమర్వించారు. నాటి వైఎస్ ప్రభుత్వం వేసిన చిక్కుముళ్లను విడదీసి పోలవరం నిర్మాణం చేపట్టామన్నారు. పోలవరం నిమిత్తం టీడీపీ హయాంలో 11,537 కోట్లు ఖర్చు పెడితే.. జగన్ కేవలం రూ. 4611 కోట్లతో సరిపెట్టారన్నారు. టీడీపీ హయాంలో 45.72 మీటర్ల ఎత్తున పోలవరం నిర్మించాలనుకుంటే.. జగన్ 41.15 మీటర్ల ఎత్తుతోనే సరిపెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

Updated Date - 2023-07-28T13:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising