ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Bose: టికెట్‌పై సీఎం జగన్‌తో ఎంపీ బోస్‌ చర్చ.. ముందే ఎందుకు చెప్పలేదంటూ అసహనం

ABN, First Publish Date - 2023-07-18T20:02:59+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో (YS Jaganmohan Reddy) వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) సమావేశమయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో తన వివాద విషయంపై మంగళవారం జగన్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్ చర్చించారు. ఈ భేటీలో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌పై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో (YS Jaganmohan Reddy) వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) మంగళవారం సమావేశమయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో తన వివాదం విషయంపై జగన్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్ చర్చించారని సమాచారం.


ఈ భేటీలో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీరుపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన కుమారుడికి సీటు ఆశిస్తున్న విషయం ముందుగా ఎందుకు చెప్పలేదని బోస్‌ను జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పార్టీ దృష్టికి ఈ విషయాన్ని ఎందుకు ముందే తేలేదంటూ ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. వేణుకి సీటును ప్రకటించాక ఇప్పుడు అసహనం వ్యక్తం చేయడం కరెక్టేనా అని బోస్‌ను జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. వారసుల విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేమని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి రోడ్డుకెక్కడంపై ఎంపీ బోస్‌పై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది.

Updated Date - 2023-07-18T20:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising