BJP Leader: భగవంతునిపై నమ్మకం లేని వారు అధికారంలో ఉంటే ఇంతే మరి..
ABN, First Publish Date - 2023-10-10T12:59:54+05:30
దేశంలో ఏ పుణ్యక్షేత్రంలోనూ ఆయా ఆలయాలకు వచ్చే సొమ్మును ఆలయాలున్న మున్సిపాలిటీలకు ఇస్తున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తిరుపతి: దేశంలో ఏ పుణ్యక్షేత్రంలోనూ ఆయా ఆలయాలకు వచ్చే సొమ్మును ఆలయాలున్న మున్సిపాలిటీలకు ఇస్తున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి (BJP Leader Bhanu Prakash reddy) ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. క్రైస్తవ మిషనరీలు, ముస్లీం మసీదుల నిధులను ఇలా ఖర్చు పెట్టగలరా? అని నిలదీశారు. భగవంతుడిపై నమ్మకం లేని వారు అధికారంలో ఉంటే ఇలాగే ఉంటుందన్నారు. టీటీడీ (TTD) నిధులను నియమ నిధులకు వ్యతిరేకంగా తిరుపతికి ఎలా ఖర్చు పెడతారని అడిగారు. ఇప్పటికే వంద కోట్ల రూపాయలు తిరుపతి రోడ్ల కోసం ఖర్చు పెట్టారన్నారు. గరుడ వారధికి 500 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు ఖర్చు పెట్టారన్నారు. ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీటీడీ నిధులను తిరుపతిలో ఖర్చు పెడుతున్నారని తెలిపారు. భక్తులు తిరిగే చోట టీటీడీ నిధులు ఖర్చు పెడతామంటున్నారన్నారు. టీటీడీ ఉంది కాబట్టే తిరుపతి కార్పొరేషన్ అయ్యేదని.. లేదంటే ఒక పంచాయితీగానే ఉండేదన్నారు. భక్తులు వస్తున్నారు కాబట్టి తిరుపతి నుంచి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు వస్తోందన్నారు. తిరుపతిలో వస్తున్న జీఎస్టీ నుంచి అన్ని రెవిన్యూల నుంచి టీటీడీకి వాటా ఇస్తారా? అని నిలదీశారు. బోర్డులో ఈ నిర్ణయం తీసుకుంటుంటే టీటీడీ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి టీటీడీ పాలకమండలిలో ఓటింగ్ జరగాలని.. ఎస్వీబీసీలో లైవ్ పెట్టాలని.. దీనికి అనుకూలంగా ఓటింగ్ వేసిన వరంతా జైలుకు పోతారని భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-10-10T12:59:54+05:30 IST