ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP -YCP: పుంగనూరులో టీడీపీ - వైసీపీ నేతల ఘర్షణ.. ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-10-22T18:18:54+05:30

పుంగనూరులో శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల ( TDP Leaderes ) పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది టీడీపీ నేతలు గాయపడ్డారు. అయి తే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి (SP Rishanth Reddy) మీడియా సమావేశం నిర్వహించారు.

చిత్తూరు: పుంగనూరులో శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల ( TDP Leaderes ) పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది టీడీపీ నేతలు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి (SP Rishanth Reddy) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మీడియాతో మాట్లాడుతూ..‘‘పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై అసభ్యంగా ప్రవర్తించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ చేశాం. టీడీపీ కార్యకర్తల సైకిల్ యాత్రను స్దానిక గ్రానైట్ వ్యాపారస్తుడు సురేష్ మద్యం మత్తులో వాగ్వాదానికి దిగాడు. కొంతమంది ఆకతాయిలు జిల్లా వ్యాప్తంగా భయానక వాతావరణం ఉంది అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. పోలీసులకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు. తప్పు ఎవరురూ చేసినా , ఏ పార్టీ వారు చేసినా ఉపేక్షించేది లేదు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన సురేష్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నాం. సైకిల్ యాత్ర చేసిన వారు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక మీదట వారు స్థానిక పోలీసులకు సమాచారమందించి యాత్ర చేసుకోవచ్చు’’ అని ఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-10-22T18:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising