Nara Lokesh: అలిపిరి పులి దాడిలో చిన్నారి మృతి చెందడంపై విచారం
ABN, First Publish Date - 2023-08-12T16:37:44+05:30
అలిపిరి మార్గం(Alipiri way)లో పులి దాడి(Tiger attack)లో ఓ చిన్నారి మృతిచెందడంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు.‘‘కళ్ల ముందే కన్నబిడ్డ మరణం కన్నవాళ్లకి తీరని శోకం మిగిల్చింది.
తిరుపతి: అలిపిరి మార్గం(Alipiri way)లో పులి దాడి(Tiger attack)లో ఓ చిన్నారి మృతిచెందడంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు.‘‘కళ్ల ముందే కన్నబిడ్డ మరణం కన్నవాళ్లకి తీరని శోకం మిగిల్చింది. తిరుమలలో పులుల దాడులు పెరిగినా, సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో బాధిత చిన్నారి చనిపోయింది. నేరగాళ్ల పాలనలో క్రూర జంతువుల నుంచి జనానికి రక్షణ కరవైంది.భక్తుల భద్రతకి భరోసా ఇచ్చేలా తక్షణమే సర్కారు చర్యలు తీసుకోవాలి. చిన్నారి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి. చిన్నారి తల్లిదండ్రులపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేయడం, వైసీపీ పైశాచిక ప్రవృత్తిని బయట పెడుతోంది. మీ అధినేత జగన్ ఓట్లు- సీట్లు కోసం బాబాయ్ అని కూడా కనికరించకుండా చంపేశాడని, అందరూ సైకో అబ్బాయిలా ఉండరు. దుర్మార్గపు ఆరోపణలు మాని, బాలిక కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి’’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-08-12T17:32:45+05:30 IST