ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala Security: శ్రీవారి ఆలయంలోకి కారు... పట్టించుకోని భద్రతా సిబ్బంది

ABN, First Publish Date - 2023-01-31T15:35:20+05:30

తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల (Tirumala)లో భద్రతా వైఫల్యం (Security failure) మరోసారి బయటపడింది. మూడంచల భద్రతా సిబ్బంది, చెక్‌పోస్టులను దాటి శ్రీవారి ఆలయంలోకి కారు వచ్చింది. వాహనంపై సీఎంవో స్టిక్కర్ (CMO sticker) ఉంది. కారును అసలు టీటీడీ భద్రతా సిబ్బంది (TTD Security Personnel)పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా రామ్‌బగీచ (Rambagicha) వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌ నుంచి ప్రముఖులకు సంబంధించి కార్లతో పాటు టీటీడీ కార్లను లోనికి అనుమతిస్తారు. రామ్‌బగీచ నుంచి శ్రీవారి పుష్కరిణి (Srivari Pushkarini) వరకు మూడు చెక్‌పోస్టులు ఉంటాయి. వాహనాల్లో ఎవరున్నారో తనిఖీ చేసిన అనంతరమే భద్రతా సిబ్బంది వారిని వీఐపీ కారు పార్కింగ్‌లోకి అనుమతించడం జరుగుతుంది. ఈ క్రమంలో సీఎంవో స్టిక్కర్ వేసుకున్న ఓ కారు శ్రీవారి ఆలయ పుష్కరిణి సమీపంలోకి వెళ్లింది. అలా వెళ్లిన కారును భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం భద్రతలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది.

సీఎం కారుకు కూడా రామ్‌బగీచ నుంచి పుష్కరిణి ముందున్న సెక్యూరిటీ గేట్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే సీఎంవో స్టిక్కర్ వేసుకున్న కారు నేరుగా పుష్కరిణికి వెళ్లిపోయినప్పటికీ భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

Updated Date - 2023-01-31T15:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising