ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఎస్వీ వర్సిటీలో రోడ్ల నిర్మాణంపై విద్యార్థి సంఘాల ఫైర్.. బంద్‌కు పిలుపు

ABN, First Publish Date - 2023-07-31T16:20:11+05:30

ఒబెరాయ్ హోటల్ కోసం యూనివర్సిటీలో 60, 80, 100 అడుగులతో మూడు రోడ్ల నిర్మాణానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం యూనివర్సిటీ బంద్‌కి అన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు వీసీకి వినతి పత్రం సమర్పించారు.

తిరుపతి: ఒబెరాయ్ హోటల్ కోసం ఎస్వీ యూనివర్సిటీ (sv university tirupati)లో 60, 80, 100 అడుగులతో మూడు రోడ్ల నిర్మాణానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం యూనివర్సిటీ బంద్‌కి అన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు వీసీకి వినతి పత్రం సమర్పించారు.

ఈరోజు యూనివర్సిటీ ప్రాంగణంలో అఖిల విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఎస్వీ.యూనివర్సిటీ మధ్యలో ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్, హాస్టళ్లు, లైబ్రరీ మధ్యలో రోడ్ల నిర్మాణం తగదని విద్యార్థి సంఘాలు తెలిపాయి. ‘‘రోడ్లు నిర్మిస్తే ఎలాంటి ఫిల్లర్లు లేకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిన అతి పెద్ద ఆడిటోరియం కూలిపోతుంది. సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తారా?, యూనివర్సిటీ మధ్యలో మూడు రోడ్లతో విపరీతమైన వాహనాల రాకపోకలు జరిగితే చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు ఏం కావాలి?, యూనివర్సిటీలో రోడ్ల నిర్మాణం వెనుకున్న కుట్రను బహిరంగపరచాలి. రోడ్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకుంటాం’’ అని అఖిలపక్ష విద్యార్థి సంఘం నేతలు ప్రకటించారు.

Updated Date - 2023-07-31T16:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising