ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshYuvaGalam: పుంగనూరు పుడింగి సామ్రాజ్యాన్ని కూల్చేద్దాం.. ఎవ్వరినీ వదల

ABN, First Publish Date - 2023-02-03T11:49:21+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఎనిమిదవ రోజు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (TDP Nara Lokes YuvaGalam Padayatra) ఎనిమిదవ రోజు కొనసాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గం మొగిలి ఈశ్వరాలయం నుంచి యాత్ర మొదలైంది. ఈ క్రమంలో యువనేత (NaraLokesh)ను రొంపిచర్ల టీడీపీ నేతలు (Rompicharla TDP Leaders) కలిసి తమ బాధను తెలియజేశారు. టీడీపీ (TDP)లో తిరిగితే చంపేస్తామని సీఐ ఆశీర్వాదం బెదిరిస్తున్నారు సార్.. ఆదుకోండి అంటూ వేడుకున్నారు. ‘‘మాపై దాడి చేసి, మమ్మల్నే జైలుకు పంపారు. పుంగనూరులో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు’’ అంటూ రొంపిచర్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

యువనేత లోకేష్‌ (YuvaGalamPadayatra)తో వారు మాట్లాడుతూ... జనవరి 7న తమపై బీరుబాటిళ్లతో వైసీపీ నేతలు (YCP Leaders) దాడి చేశారన్నారు. వైసీపీ జడ్పీటీసీ రెడ్డిఈశ్వరరెడ్డి తన అనుచరులతో దాడి చేయించారని తెలిపారు. టీడీపీ కట్టిన బ్యానర్లను ప్రతిసారి చింపేస్తూ రెచ్చగొడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే దాడి చేయడమే కాకుండా.. తమపైనే అక్రమ కేసులు బనాయించారన్నారు. అరెస్టు చేసిన ఎస్.ఐ శ్రీనివాస్ స్టేషన్లో తమను విచక్షణారహితంగా లాఠీతో కొట్టారని... కనీసం 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లు చెప్పాలని బలవంతం చేశారని తెలిపారు. కల్లూరు సీఐ ఆశీర్వాదం నీచాతినీచంగా బూతులు తిట్టారన్నారు.

‘‘మా తల్లుల శీలాన్ని శంకించేలా అసభ్య పదజాలంతో దూషించాడు. టీడీపీలో తిరిగితే ఎన్ కౌంటర్ చేసేస్తానని బెదిరించాడు. పోలీసులను అన్నా అని సంభోదించినందుకు ఎస్.ఐ మమ్మల్ని బూటుకాళ్లతో తన్నాడు. మాపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు. మెజిస్ట్రేట్ ముందుకు ఒక్కొక్కరిని పంపిస్తూ ఎవరైనా పోలీసులకు వ్యతిరేకంగా జడ్జికి చెబితే కాల్చేస్తామంటూ ఎస్.ఐ శ్రీనివాస్ మాపై తుపాకీ గురిపెట్టి బెదిరించాడు. ఎనిమిది మందిని అక్రమంగా జైలుకు పంపారు. 25 రోజులు పీలేరు సబ్ జైల్లో నరకం చూసి బయటకు వచ్చారు. పుంగనూరులో పెద్దిరెడ్డి నియంత సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. మాకు అండగా నిలబడి మమ్మల్ని ఆదుకోవాలి’’ అంటూ టీడీపీ నేతలు కోరారు.


ఏ ఒక్కరినీ వదిపెట్టను: లోకేష్

టీడీపీ నేతల ఆవేదనపై లోకేష్ స్పందిస్తూ... ‘‘మీరంతా మంచి పోరాటం చేశారు. పార్టీ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటుంది. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టను. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్లకు చక్రవడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. మీరంతా పార్టీలో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి. మీకు నేనున్నా. పుంగనూరు పుడింగి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేద్దాం. పసుపుజెండాను పుంగనూరులో ఎగరేద్దాం. అధికారంలోకి వచ్చాక మీపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తేసే చర్యలు తీసుకుంటాను. అధైర్య పడకండి... భయం టీడీపీ బయోడేటాలో లేదనేది మీరు నిరూపించారు. శభాష్’’ అంటూ లోకేష్ అభినందించారు.

Updated Date - 2023-02-03T11:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising