ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: ఐదవ రోజుకు లోకేష్ పాదయాత్ర... అరటి రైతులతో ముచ్చట

ABN, First Publish Date - 2023-01-31T11:01:35+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర (TDP National General Secretary Nara Lokesh Yuvagalam Padayatra) ఐదవ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం వీకోట మండలం దానమయ్యగారిపల్లె నుంచి లోకేష్‌ పాదయాత్ర (Lokesh Padayatra) ప్రారంభమైంది. పలమనేరు నియోజకవర్గం కుమ్మరమాడుగు దగ్గర ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో టీడీపీ నేత (Nara Lokesh) మాట్లాడారు. ఆపై అరటి రైతుల (Banana farmers)తో ముచ్చటించారు. రైతులు తిప్పయ్య, శివరాజ్, నాగ రాజు, కుషాల్ కుమార్‌తో లోకేష్ (YuvaGalamPadayatraLokesh) సంభాషించారు. ‘‘ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి అవుతుంది. ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా పెరిగింది. ఎకరం పంట అమ్మితే లక్షన్నర మాత్రమే వచ్చింది. సుమారుగా రూ.2 లక్షలు నష్టపోయాం. కిలోకి రూ.15 రేటు రావడం కష్టంగా మారింది. పెట్టుబడి ఖర్చు తగ్గి, మంచి రేటు వస్తే తప్ప అరటి రైతులు కోలుకునే పరిస్థితి లేదన్న’’ విషయాన్ని లోకేష్ (YuvaGalamLokesh) దృష్టికి అరటి రైతులు తీసుకువచ్చారు.

దీనిపై లోకేష్(YuvaGalamPadayatra) స్పందిస్తూ... ‘‘మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా పోరాడతాను. అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గిట్టు బాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తాం’’ అని హామీ ఇచ్చారు.

సమస్యలు తెలుసుకుంటూ ముందుకు....

ఈనెల 28 నుంచి కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు 4000 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. తొలిరోజు పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతీ చోట ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ... రాబోయే రోజుల్లో టీడీపీ చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో పలువురు రైతులతో మాట్లాడిన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము పడుతున్న ఇబ్బందులను లోకేష్ ముందు ఏకరవు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు తీరుస్తామని రైతులకు హామీ ఇస్తూ లోకేష్ పాదయాత్రలో ముందుకు వెళుతున్నారు.

Updated Date - 2023-01-31T11:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising