YuvaGalamPadayatra: లోకేష్ పాదయాత్రలో టెన్షన్... టెన్షన్
ABN, First Publish Date - 2023-02-04T09:46:12+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాయాత్రలతో టెన్షన్ నెలకొంది. పాదయాత్రలో అడ్డంకులు సృష్టించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర (TDP Leader NaraLokesh YuvaGalam Padayatra) లో టెన్షన్ నెలకొంది. పాదయాత్రలో అడ్డంకులు సృష్టించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అందులో భాగంగా బంగారుపాలెంలో పాదయాత్రలో మూడు ప్రచార వాహనాలను పోలీసులు (Police) సీజ్ చేశారు. ఒక సౌండ్ సిస్టం వాహనం, ఒక ప్రచార రథం, వీడియో కవరేజ్‌కు ఏర్పాటు చేసిన లైవ్ వెహికిల్‌ను సీజ్ చేశారు. బంగారుపాలెంలో సీజ్ చేసిన వాహనాలను గంగవరం రూరల్ సబ్ డివిజన్ కార్యాలయానికి తరలించారు. దీంతో ప్రచారానికి టీడీపీ శ్రేణులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రచారంలో పాదయాత్ర (YuvaGalam)లో ఇలాంటి మైకులు వాడకూడదు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు తీరుపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీజీపీకి లేఖ...
మరోవైపు బంగారుపాలెంలో చోటు చేసుకున్న పరిణామాలపై డీజీపీ (AP DGP) కి టీడీపీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) లేఖ రాశారు. లోకేష్ పాదయాత్ర (YuvaGalam Padayatra)కు సంబంధించి నిర్ధేశించిన ప్రకారం స్థానిక పోలీసు అధికారులకు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. అధికారపార్టీతో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కై యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగానే విద్యుత్ నిలిపివేశారని... మూడు వాహనాలు సీజ్ చేశారన్నారు. డీఎస్సీ సుధాకర్ రెడ్డి నాయకత్వంలో పోలీసులు యువగళం వాలంటీర్లను హింసిస్తున్నారని చెప్పారు. పోలీసులు వాలంటీర్లపై, టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, బండ బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారన్నారు. గజేంధ్ర అనే యువగళం వాలంటీర్‌పై పలమనేరు ఇన్స్పెక్టర్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారపార్టీతో కుమ్మక్కై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సీజ్ చేసిన యువగళం వాహనాలను రిలీజ్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించేలా స్థానిక పోలీసు అధికారులకు ఆదేశించాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-02-04T09:46:13+05:30 IST