ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: నేటి నుంచి టీడీపీ వరుస కార్యక్రమాలు

ABN, First Publish Date - 2023-10-25T07:53:32+05:30

అమరావతి: తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. ‘నిజం గెలవాలి’ పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. ‘నిజం గెలవాలి’ పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి కనీసం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నారా లోకేష్ నవంబర్ ఒకటోవ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. భవిష్యత్‌కు ‌ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో జనంలోకి వెళ్లనున్నారు. పార్టీ కార్యక్రమాలు, నిర్వహణపై ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలతో లోకేష్ చర్చించి ప్రణాళిక రూపొందించారు.

మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును కరపత్రాల ద్వారా గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లే విధంగా ‘బాబుతో నేను’ అనే కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు, వర్షాభావ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలపై క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ సంయుక్తంగా ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడిగా ఉద్యమం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది.

భువనేశ్వరి పర్యటన వివరాలు..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరిట పార్టీ రూపొందించిన కార్యక్రమాన్ని ఆమె ఈ జిల్లా నుంచి చేపట్టబోతున్నారు. దానికోసం తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈ మూడు రోజులూ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొంటారు. తొలి రోజైన బుధవారం 25న చంద్రగిరిలో సమావేశంలో పాల్గొంటారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలోనూ పర్యటిస్తారు.

నిజం గెలుస్తుందని నమ్ముతున్నా!

నారా భువనేశ్వరి మంగళవారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘నా భర్త చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను.. ఈ రోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్లాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆ ఏడు కొండలవాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు(బుధవారం) తొలి అడుగు వేస్తున్నా’’ అన్నారు.

Updated Date - 2023-10-25T07:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising