ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

ABN, First Publish Date - 2023-03-22T08:22:49+05:30

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని సన్నిధిలో తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని సన్నిధిలో తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకల (Ugadi Celebrations)ను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple) లో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, అర్చన, తోమాల సేవల తర్వాత బంగారు వాకిలి వ‌ద్ద‌ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నైవేద్యం సమర్పణ చేయనున్నారు. తరువాత స్వామివారి ముందు ఆగమ పండితులు, అర్చకులు పంచాగ శ్రవణం చేయడంతో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా ముగియనుంది. ఉగాది పండుగ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకున్ని నిన్న(మంగళవారం) శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy), టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా నేడు (మార్చి 22) శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. నిన్న(మార్చి 21) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, నేడు ఉగాది ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో వీవీఐ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు

మరోవైపు నిన్న(మంగళవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 57,559 మంది భక్తులు శ్రీనివాసున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లుగా ఉంది. అలాగే శ్రీవారికి 18,150 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2023-03-22T08:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising