CID Pitition: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై హైకోర్టులో సీఐడీ తాజా పిటీషన్
ABN, First Publish Date - 2023-10-31T15:06:58+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ తాజాగా ఏపీ హైకోర్టులో పిటీషిన్ దాఖలు చేసింది.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ (CID) తాజాగా ఏపీ హైకోర్టులో (AP High Court) పిటీషిన్ దాఖలు చేసింది. ఇద్దరు సీఐడీ డీఎస్‌పీలను నిరంతరం టీడీపీ అధినేతను అనుసరించే విధంగా చూడాలని పిటిషన్‌లో పేర్కొంది. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆంక్షలు విధించాలన్నారు. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేయకూడదని కూడా పిటీషన్‌లో సీఐడీ పేర్కొంది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనకూడదని ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాల రీత్య ఇచ్చారని పేర్కొంటూ పిటీషన్ దాఖలు చేసింది. కేవలం చికిత్సకు మాత్రమే ఆయన పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో సీఐడీ పిటీషన్ వేసింది.
Updated Date - 2023-10-31T15:06:58+05:30 IST