ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotam Reddy Sridhar Reddy: దా.. దా... దా.... రండి నన్ను అరెస్ట్‌ చేయండి: కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-02-03T21:10:07+05:30

సజ్జలా... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చెయ్‌.. మీడియాకి లీకులిచ్చి నన్ను భయపెట్టాలంటే నీ తరంకాదు. మీపై నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందే తప్ప మరో మార్గంలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ‘‘సజ్జలా... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చెయ్‌.. మీడియాకి లీకులిచ్చి నన్ను భయపెట్టాలంటే నీ తరంకాదు. మీపై నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందే తప్ప మరో మార్గంలేదు. నా మీదు ఆడియోలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు. దమ్ముంటే రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం మాఫియాలపై ఆడియోలు చేసి ప్రజలకు చెప్పు కానీ ఇది చేస్తే నీ... సలహాదారు పోస్టు ఉండదు.’’ అంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) జగన్‌ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని తాను ఆధారాలు చూపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసి వాస్తవాలు నిగ్గుతేల్చాలని కోరి ఉంటే సంతోషించేవాడినని చెప్పారు. తాను ఫోన్‌లో మాట్లాడిన తన మిత్రుడిని కూడా తనకు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సజ్జలతోపాటు అతని కుమారుడు భార్గవ్‌రెడ్డి (Bhargav Reddy)లు మీడియాకు లీకులిస్టూ కోటంరెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమంటూ తనకు పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారన్నారు. దమ్ముంటే నేరుగా వందల కేసులు పెట్టి తనను జైలుకు పంపాలని సవాల్‌ విసిరారు.

ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తన గొంతు ఆగాలంటే ఎన్‌కౌంటర్‌ (Encounter) చేసి ప్రాణం తీయాలన్నారు. జైలో నుంచి పోటీ చేసి 4 లక్షల మోజార్టీతో ఎంపీగా గెలిచిన జార్జిఫెర్నాండేజ్‌ (George Fernandez) గురించి తెలుసుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక రవాణాతో రూ. కోట్లు చేతులు మారుతున్నాయని, మద్యం మాఫియాగా మారి వందల కోట్లు దారి మళ్లుతున్నాయని వాటిపై ఆడియో, వీడియోలు తీసి ప్రజలకు వాస్తవాలు చూనాలని, ఆ దమ్ము సజ్జలకుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ (YCP) రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పట్నుంచి సినిమా హాళ్ల దుస్థితి ఎలాగుందో అందరికి తెలుసని వాళ్ల దగ్గర తాను నెలకు రూ.2 లక్షలు ఎలా తీసుకోగలనని సజ్జలను నిలదీశారు.

అనిల్‌... నమ్మకద్రోహమంటే నీది!

‘‘2008లో కార్పొరేటర్‌, 2009లో ఎమ్మెల్యేగా సీటిచ్చిన దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి (Anam Vivekananda Reddy)పై తిరగబడి నువ్వు చేసిందాన్ని నమ్మకద్రోహమంటారా అనిల్‌? నీకు చీఫ్‌ ఎన్నికల ఏజెంటుగా పని చేసి, మంత్రి అయ్యాక భారీగా ఊరేగింపుతో స్వాగతం పలికిన నా పైన తిరగబడటాన్ని నమ్మక ద్రోహమంటారు అనిల్‌కుమార్‌ యాదవ్‌’’ అంటూ కోటంరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. 2009లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనిల్‌ను చూసి తన కుటుంబం భోజనం కూడా చేయలేదని గుర్తు చేసుకున్నారు. ఇంట్లో సభ్యుడిగా చూసినందుకు తన పట్ల వ్యవహరిస్తున్న అనిల్‌ తీరు బాధకరమన్నారు. తనను నేరుగా విమర్శించాలే తప్ప తన బిడ్డలను రాజకీయంలోకి లాగడం సరైంది కాదన్నారు. జగన్‌ పట్ల తాను తప్పు చేసి ఉంటే ఆ దేవుడు తనను శిక్షించాలని తాను కోరుకుంటున్నానన్నారు.

బెదిరిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా!

రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు ఏకమై తనపై మాటలదాడులు చేస్తున్నారని కానీ ఇవేవి పట్టించుకోనని శ్రీధర్‌రెడ్డి అన్నారు. తనను ఎవరైన విమర్శిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని గుర్తు చేశారు. నెల్లూరురూరల్‌ ప్రజలకు మరింత అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం రెట్టింపుగా కృషి చేస్తానని తెలిపారు. డిసెంబరు 25న ఓ బెంజ్‌ కారులో వెళ్లి చంద్రబాబును కలిసినట్లు ఓ పత్రిక (ఆంధ్రజ్యోతి కాదు) కథనం ప్రచురించిందని తప్పుపట్టారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ రోజు తాను చర్చిలలో జరిగిన పలు వేడుకల్లో ఉదయం నుంచి రాత్రి వరకు తీరికలేకుండా గడిపానన్నారు.

సజ్జల భార్గవ్‌రెడ్డి ఎప్పటోడు?

జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలో రావాలని అనేక మంది కార్యకర్తలు రూపాయి ఆశించకుండా సోషల్‌ మీడియాలో సైనికుల్లా పని చేస్తే వారందరిని పక్కన పెట్టి సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా సజ్జల భార్గవ్‌రెడ్డిని పెట్టడమేమిటని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఆయన ప్రతిపక్షంలో ఏమయ్యాడు....? ఎక్కడున్నాడంటూ సూటిగా ప్రశ్నించారు. వందల మంది కార్యకర్తల కష్టంతో జగన్‌ సీఎం అయ్యాడన్న వాస్తవాన్ని సజ్జల తెలుసుకోవాలన్నారు. నెల్లూరురూరల్‌ వైసీపీ ఇన్‌చార్జిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి (Adala Prabhakar Reddy)కి ఇవ్వడం పట్ల శుభాభినందనలు వ్యక్తం చేసిన ఆయన నెల్లూరురూరల్‌లో ఆదాల కాలుతో చేబితే అధికారులు చేత్తో చేయాలన్నట్టుగా సీఎం కార్యాలయం ఆదేశాలిచ్చిందని తెలిపారు. నెల్లూరులోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదాలను కోటంరెడ్డి కోరారు.

Updated Date - 2023-02-03T21:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising