ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: కరువు సమస్యపై విన్నవించేందుకు వెళ్లడం నేరమా?

ABN, First Publish Date - 2023-11-07T11:02:40+05:30

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సీపీఐ, టీడీపీ నేతల అక్రమ అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.

అమరావతి: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సీపీఐ, టీడీపీ నేతల అక్రమ అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) పుట్టపర్తి పర్యటన సందర్భంగా కరువు సమస్యపై విన్నవించేందుకు వెళ్లడం నేరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదని విమర్శించారు. కరువు సమస్యపై మాట్లాడేందుకు కూడా జగన్‌కు తీరిక లేదా? అని నిలదీశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


కాగా.. శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ చలో పుట్టపర్తికి టీడీపీ (TDP) పిలుపునివ్వగా.. పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu), పల్లె రఘునాథరెడ్డి (Palle Raghunathreddy), మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి (BK Parthasarathi), మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పోలీసుల అదుపులో ఉన్నారు. మడకశిర నుంచి పోలీసు వాహనాల్లో తరలించి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నేతలను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

Updated Date - 2023-11-07T11:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising