CPI Leader: ఆ ముగ్గురు కలిసే చంద్రబాబును అరెస్ట్ చేయించారు... రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-10-13T15:00:19+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసికట్టుగా వ్యూహం రచించి పకడ్బందీగా చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించారన్నారు.
అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై (TDP Chief Chandrababu Arrest) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah), ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan reddy) కలిసికట్టుగా వ్యూహం రచించి పకడ్బందీగా చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల (Telangana Elections) షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించారన్నారు. 12 రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ లోకేష్‌కు ఒక్కరోజు కూడా హోంమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గద్దె దిగే వరకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకమవుతాయని రామకృష్ణ స్పష్టం చేశారు.
Updated Date - 2023-10-13T15:00:19+05:30 IST