ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kottu Satyanarayana: ఆ మూడు పార్టీలు కలిస్తే ఏదో అవుతుందని ప్రచారం.. ఇందులో కొత్తేమీ లేదన్న డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2023-07-25T16:01:16+05:30

ప్రతిపక్ష పార్టీలు పొత్తులు, ఎత్తులు, కుట్రలతో కాలక్షేపం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: ప్రతిపక్ష పార్టీలు పొత్తులు, ఎత్తులు, కుట్రలతో కాలక్షేపం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Deputy CM Kottu Satyanarayana) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 2024లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని.. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ది ప్రజారంజక పాలన అని చెప్పుకొచ్చారు. జగన్ (AP CM Jagan Reddy) పాలనపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు 2019 నుంచి మరలా వచ్చే ఎన్నికల కోసమే పని చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. తాము ప్రజలను, భగవంతుడిని నమ్ముకున్నామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు గురుంచి ఆలోచించకూడదన్నారు. వాళ్ళు గతంలో కూడా పొత్తు పెట్టుకున్నారని.. ఇందులో కొత్తేమీ లేదని డిప్యూటీ సీఎం అన్నారు.


మూడు పార్టీలు కలిస్తే ఏదో అవుతుందని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబుతో (TDP Chief Chandrababu Naidu) పొత్తు పెట్టుకునే పని ఎవరు చేస్తారని అన్నారు. జనసేనకు రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుందని తెలిపారు. అందుకే ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుతిన్నారని ఆరోపించారు. ఎఫ్‌ఏవోకు ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల అమలులో సర్వేల కోసం ఎఫ్‌ఏఓను ఉపగేగించుకుంటే తప్పేంటి అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రాజకీయాలపై మాట్లాడిన ఆయన.. పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీకి కమిటెడ్ లీడర్ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-07-25T16:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising