Sharannavaratri Celebrations: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం రేపే..
ABN , First Publish Date - 2023-10-14T12:22:48+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో రేపటి (ఆదివారం) నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. రేపు తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ (Vijayawada Durgamma Temple) ఆలయంలో రేపటి (ఆదివారం) నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. రేపు తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
అమ్మవారి అలంకారాలు ఇవే..
అక్టోబర్ 15న శ్రీబాలత్రిపుర సుందరీ దేవి
అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవి
అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి
అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి
అక్టోబర్ 19న శ్రీ మహాచండీ దేవి
అక్టోబర్ 20న మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి
అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
అక్టోబర్ 22న శ్రీ దుర్గాదేవి
అక్టోబర్ 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీమహిషా సురమర్ధనీ దేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దర్శనమిస్తారు.
అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరుగనుంది. దసరా ఉత్సవాలకు 8 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేయనున్నారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశఆరు. అలాగే కమాండ్ కంట్రోల్ రూం ద్వారా క్యూలైన్ల మానిటరింగ్ చేయనున్నారు. వృద్ధులకు, వికలాంగులకు బ్యాటరీ కార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘాట్లలో పుణ్య స్నానాలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.