Ramakrishna: ‘పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే’
ABN, First Publish Date - 2023-02-20T11:24:43+05:30
నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోవటం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని...
రాజమండ్రి: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు కేంద్రం నిధులు ఇవ్వకపోవటం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (CPI Leader K Ramakrishna) విమర్శలు గుప్పించారు. సోమవారం ఉదయం రామకృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టు పరిశీలన యాత్రకు సీపీఐ రాష్ట్ర బృందం బయలుదేరింది. ఈ సందర్భంగా సీపీఐ నేత మాట్లాడుతూ... 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అప్పటి మంత్రి అనిల్ కుమార్ చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు (National Project)గా ప్రకటించబడిన పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రాని (Central Government)దే అని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి షెకావత్ (Union Minister Shekawat)ను కోరతామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ (R&R package), పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణ పనిపూర్తికి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కేంద్రం తగు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికోసం రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. ఏపీ (Andhrapradesh)లో సీపీఐ ప్రాజెక్టుల పరిశీలన అనంతరం ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సీపీఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు.
Updated Date - 2023-02-20T11:24:45+05:30 IST