ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Health Condition: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

ABN, First Publish Date - 2023-10-14T16:43:07+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శనివారం నాడు చంద్రబాబుతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంలో చంద్రబాబును చూసి నారా భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నారా లోకేష్, భువనేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా....ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 6 తేదీ నుంచి ములాఖత్‌లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. నేడు వీక్‌గా కనిపించడంపై కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు. గత ములాఖత్ నాటికి, నేటికి చంద్రబాబులో చాలా మార్పు వచ్చినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: కాసాని జ్ఞానేశ్వర్

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneswer) తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించందన్న ఆవేదనతోనే లోకేష్, భువనేశ్వరిలు మీడియాతో మాట్లాడలేదు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

చంద్రబాబుకు వైద్య పరీక్షల కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రభుత్వ ఆస్పత్రి చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్లు సూర్యనారాయణ, సునీతాదేవి చేరుకున్నారు. చంద్రబాబుకు జైలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-10-14T16:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising