ఎమ్మెల్యేపై హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2023-07-08T00:25:54+05:30 IST
ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మహిళలు, బాలికలతో కాళ్ళు కడిగించుకున్న సంఘటనపై విచారణ నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

అనపర్తి, జులై 7 : ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మహిళలు, బాలికలతో కాళ్ళు కడిగించుకున్న సంఘటనపై విచారణ నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల అనపర్తి నియో జక వర్గం పెదపూడి మండలం రామేశ్వరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలలతో కాళ్లు కడిగించుకోవడం చట్టరిత్యా నేరమ న్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడడమే కాకుండా సోషల్ మీడియాలో వారే ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. విచారణ జరపాలని ఢిల్లీలోని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమి షన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై టీడీపీ ఎంపీలు కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ తరపున కోరుతున్నామ న్నారు.సమావేశంలో నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, తమ లంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, జుత్తుగ కృష్ణ, సూరిబాబు, కర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.