CBN Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బెంగళూరులో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు
ABN, First Publish Date - 2023-10-08T16:11:45+05:30
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు(Bangalore)లో సమర శంఖారావం సభకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.
బెంగళూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు(Bangalore)లో సమర శంఖారావం సభకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. సమర శంఖారావం ప్రాంగణంలో ‘‘బాబుతో నేను’’ అంటూ వేలాదిమంది బెంగళూరు ప్రజలు చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. చంద్రబాబుకు మద్దతు కోసం BTF ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పలువురు టీడీపీ శ్రేణులు భారత ప్రధాన న్యాయమూర్తికి సామూహిక లేఖలు రాశారు. సమర శంఖారావం సభకు 14 మందికి పైగా టీడీపీ అగ్ర నాయకులు హాజరవుతున్నారు. ఇప్పటికే సభకు వేలాది మంది తెలుగు ప్రజలు భారీగా తరలి వచ్చారు. కాసేపటి క్రితమే సమర శంఖారావం సభ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ నేతలు శంఖారావం పూరించారు.రానున్న ఎన్నికలకు సమరానికి సిద్ధమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు శంఖారావం పూరించారు.
సమర శంఖారావం సభకు హాజరైన టీడీపీ నేతలు వీరే..
1. చింతకాయల అయ్యన్నపాత్రుడు (మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో మెంబర్)
2. కొల్లు రవీంద్ర (మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో మెంబర్)
3. N అమర్నాథ్‌రెడ్డి (మాజీ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
4. R శ్రీనివాసులరెడ్డి (పోలిట్ బ్యూరో మెంబర్ & కడప జిల్లా అధ్యక్షులు)
5. యరపతినేని శ్రీనివాసరావు (మాజీ ఎమ్మెల్యే, గురజాల ఇన్‌చార్జి)
6. Dr. M ఉగ్ర నరసింహారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
7. పరిటాల శ్రీరామ్ (ధర్మవరం ఇన్‌చార్జి)
8. భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ.
9. కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ.
10. చింతమనేని ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే, దెందులూరు ఇన్‌చార్జి)
11. యార్లగడ్డ వెంకట్రావు (గన్నవరం ఇన్‌చార్జి).
12. చింతకాయల విజయ్ (ఐటీడీపీ ఇన్‌చార్జి)
13. P తేజస్విని (TPW ప్రెసిడెంట్)
14. మాధవనాయుడు (జాతీయ ఉపాధ్యక్షుడు)
కర్నూలు జిల్లాలో వినూత్న నిరసన
కర్నూలు: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు ఆందోళనలను తీవ్రం చేశారు. రోజుకోక విధంగా టీడీపీ నేతలు వినూత్న పద్ధతులల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఆదివారం నాడు ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తలకిందులుగా నిలబడి తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. సైకిల్ రావాలి సైకో పోవాలి అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఉండిలో శివరామరాజు నిరసన
ఏలూరు: ఉండిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ వినూత్న ఆందోళన చేపట్టారు. శిలువపై వేలాడుతూ శివరామరాజు నిరసన తెలిపారు. కాళ్లు, చేతులకు గొలుసులు కట్టి, నల్ల దుస్తులు వేసుకుని శిలువపై పడుకొని నిరసన తెలిపారు. శివరామరాజుకు టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు.
Updated Date - 2023-10-08T16:45:08+05:30 IST