ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TV Rama Rao: కొవ్వూరులో వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే రామారావు గుడ్‌బై

ABN, First Publish Date - 2023-03-10T16:13:03+05:30

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో టీవీ రామారావు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై తూర్పుగోదావరి జిల్లా

రామారావు గుడ్‌బై
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజమండ్రి: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో టీవీ రామారావు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అనుచరులతో భేటీ అయి చర్చిస్తున్నారు. 2009లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం నిడదవోలులో జరిగిన ఓ కేసులో ఇరుక్కుని రాజకీయ ఒడుదుడుకులకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మరోసారి టికెట్ లభించలేదు. దీంతో 2014లో టీడీపీ నుంచి టికెట్ రాకపోయినా... కేఎస్.జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసి టీడీపీ విజయానికి పాటు పడ్డారు. ఇక 2019 ఎన్నికల్లోనైనా తెలుగు దేశం నుంచి టికెట్ వస్తుందని ఆశించినా భంగమే ఎదురైంది. దీంతో ఆయన 2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె గెలుపు కోసం కృషి చేశారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎక్కడా యాక్టివ్‌గా ఉన్నట్టుగా కనిపించలేదు. ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణ కోసం అనుచరులతో సమావేశం అయ్యారు. ఏ పార్టీలో చేరనున్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Chit chat: బార్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలతోనే వీడిన మర్డర్ మిస్టరీ.. అచ్చం అతడు సినిమాలో జరిగినట్టుగానే..!

Updated Date - 2023-03-10T16:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising