Undavalli: ఏపీ విభజనపై ఉండవల్లి చెప్పిన షాకింగ్ నిజాలు
ABN, First Publish Date - 2023-02-18T20:11:29+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arun Kumar) షాకింగ్ నిజాలు చెప్పారు.
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arun Kumar) షాకింగ్ నిజాలు చెప్పారు. ఫిబ్రవరి 18న.. ఇదే రోజు 9 సంవత్సరాల క్రితం లోక్‌సభలో తలుపులు మూసేసి, టెలికాస్ట్ ఆపేసి, ఆంధ్రా సభ్యులను సస్పెండ్ చేశారని విమర్శించారు. లోక్‌సభలో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఎంత మంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకం అన్నది తేలకుండా భారతదేశ పార్లమెంట్ చరిత్రలో బిల్లు పాస్ అయిపోయిందని ప్రకటించిన ఏపీ విభజన బిల్లు అని ఉండవల్లి విమర్శించారు. తాను ఆరోజు నుంచీ చెబుతున్నానని, ఈ బిల్లు పాస్ అవలేదని స్పష్టం చేశారు.
రూల్స్ ప్రకారం ఆర్టికల్ 100 ప్రకారం ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే బిల్లుపై చర్చ జరగాలని, ఎంత మంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకం అన్నది స్పీకర్ అడగాలని చెప్పారు. బిల్లు పాస్ చేసేటప్పుడు ఏ పార్టీ సభ్యుడైనా లేచి డివిజన్ అంటే.. ఏపీ విభజన బిల్లుకు ఎంత మంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకం అన్నది స్పీకర్ చెప్పాలని ఉండవల్లి తెలిపారు. 40 క్లాజ్‌లు ఉంటే 40 క్లాజ్‌లు అడిగితే.. 40 క్లాజ్‌లను విడగొట్టి చెప్పాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో స్పీకర్ 367ను మొట్టమొదటి సారి వాడారని చెప్పారు.
అప్పట్లో 367 ప్రకారం బిల్లుకు అనుకూలంగా ఉన్న సభ్యులు సభలో కూర్చుంటారని, వ్యతిరేకంగా ఉన్న సభ్యులను సభ నుంచి బయటకు పంపించి లెక్కిస్తారని తెలిపారు. బాలయోగి టైంలో 367ను వాడారని, ప్రత్యక్షప్రసారం చేశారని తెలిపారు. లైవ్ పెట్టిన తర్వాత ఆగిపోయిందని చెప్పడం ఇదేతొలిసారి అని అన్నారు. బిల్లుపై చర్చ జరుగుతున్న గంట సేపు లైవ్ ఆగిపోయిందని, మళ్లీ తిరిగి ప్రారంభమైందని ఉండవల్లి పేర్కొన్నారు. ఆర్టీఐ అధికారులను అడిగే ఆ రోజు లైవ్ టెలికాస్ట్ పాడయిపోయిందని చెప్పారని ఉండవల్లి అన్నారు. మొత్తం 12 కెమెరాలు ఒక్కసారే ఆగిపోయి.. మళ్లీ వెంటనే వచ్చాయని అధికారులు చెప్పారని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు.
మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Arun Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబు (Chandrababu)ను అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వరకూ పాదయాత్రలు చూశానన్నారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని.. నాడు కాంగ్రెస్ జగన్‌ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
చంద్రబాబు సభకు ముందుగా ఇచ్చిన అనుమతులు హఠాత్తుగా రద్దు... సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసుల చిత్ర విచిత్ర వ్యూహాలు... వాళ్లే రహదారులకు వాహనాలు అడ్డుపెట్టడం... నిరసనకారుల తరహాలో ఖాకీ దుస్తులతో పోలీసులే రోడ్డుపై బైఠాయించడం... రోజంతా సృష్టించిన రచ్చతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘ఇకపై పోలీసులకు సహకరించం. సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నా’ అని ఉద్ఘాటించారు. నాడు మహాత్ముడు నిర్వహించిన ‘దండి యాత్ర’ స్ఫూర్తితో... ‘అనపర్తి మార్చ్’ నిర్వహిస్తున్నా అంటూ వేలాదిమంది కార్యకర్తలు కదిలిరాగా, ఆరు కిలోమీటర్ల మేర కదం దొక్కారు. అన్ని అడ్డంకులనూ ఛేదించుకుని అనపర్తి దేవీచౌక్ రైల్వే స్టేషన్ రోడ్డులో జరిగిన సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీసుల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఏదిఏమైనా ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలని పోలీసు అధికారులు... ‘మైక్ దగ్గరికొస్తే సహించేది లేదు’ అని చంద్రబాబు హెచ్చరికలు! అటు జనంలో ఉరిమే ఉత్సాహం! దీంతో... అనపర్తి దేవీ చౌక్ హైటెన్షన్‌కు వేదికగా మారింది.
సుప్రీంకోర్టులో ఈ నెల 22న విభజన కేసుపై వాయిదా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా నాలుగు రోజులు సమయం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వెయ్యాలని.. ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నారు. తన వాదన సరైందని సజ్జల అన్నారన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే విభజన హక్కులు సాధిస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
*************************************
************************
స్పిన్నే ఎదురుతన్నింది.. ఢిల్లీ టెస్టులో టీమిండియా నెగ్గాలంటే శ్రమించాలి
**************************************
Updated Date - 2023-02-18T23:17:37+05:30 IST