ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yanamala Ramakrishna: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం

ABN, First Publish Date - 2023-10-01T17:25:13+05:30

అక్రమ కేసులు బకాయించి జగన్ ఆనందపడుతున్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) వ్యాఖ్యానించారు.

రాజమండ్రి: అక్రమ కేసులు బకాయించి జగన్ ఆనందపడుతున్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేపు గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు, రాజమండ్రిలో భువనేశ్వరి, ఢిల్లీలో లోకేష్ సత్యాగ్రహా దీక్ష చేస్తారు. 15 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎన్నికలల్లో ఖర్చు చేయడానికి జగన్ కుట్ర పన్నారు. అభివృద్ధి లేదు. రోడ్లు అన్ని అధ్వానంగా ఉన్నాయి. జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. వైసీపీ ప్రజాధారణ కోల్పోతున్నారనే భయంతో అధికారులు, వలంటీర్లతో కలిసి కుట్ర చేస్తున్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడిని ఆధారాలు లేకుండా లోపల పెట్టడంపై రాష్ట్రంలో, దేశంలోనూ చాలా మంది జగన్‌రెడ్డి చర్యలను ఖండిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జీరో స్థాయికి వెళ్తారని భయంతో డైవర్ట్ చేయడనికి ఇలా అక్రమ అరెస్ట్ చేశారు. జగన్మోహన్‌రెడ్డి అధికారులను భయపెట్టి...పని చేయిస్తున్నారు. ఎనికల్లో ఉపయోగించుకోవడానికి. 10 నుంచి 11లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రజల డబ్బుతో జగన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నాడు’’ అని యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

నిరసనలను ఆపే హక్కు వైసీపీకి లేదు: గోరంట్ల బుచ్చయ్య

రేపు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు నిరసన దీక్షలు చేపడతారని ఆ పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య(Gorantla Butchayya) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సెక్షన్ 30 , 144 ఆంక్షలతో నిరసనలు చేయకుండా జగన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు.. నిరసనలను ఆపే హక్కు వైసీపీకి లేదు.ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు భువనేశ్వరి దీక్షలో పాల్గొంటాని గోరంట్ల బుచ్చయ్య పేర్కొన్నారు.

జగన్ బాధపడే రోజు దగ్గరలోనే.. : ప్రత్తిపాటి పుల్లారావు

అతి త్వరలో జగన్ బాధపడే రోజు దగ్గరలోనే ఉందని.. గుర్తు పెట్టుకోవాలని తెలుగుదేశం సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు(Prattipati Pullarao) అన్నారు. రేపు 175 నియోజకవర్గాలల్లో అన్నివర్గాల ప్రజలు గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు చేయనున్నారు. ప్రజలంతా కులాలకు అతీతంగా చంద్రబాబు వెంట నడవనున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్న నేతలకు కావాలని జగన్మోహన్‌రెడ్డి కులం ఆపాదిస్తున్నాడని ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

Updated Date - 2023-10-01T17:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising