ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఉల్లిపాయ - బంగాళాదుంపకు తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎం.. దేవినేని ఎద్దేవా

ABN, First Publish Date - 2023-12-09T13:05:25+05:30

Devineni Uma: రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సాగు నీరు అందించడంలో వైసీపీ విఫలం అయ్యిందని.. ఓ ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి, తుఫాన్ ప్రభావంతో అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయన్నారు.

విజయవాడ: రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సాగు నీరు అందించడంలో వైసీపీ విఫలం అయ్యిందని.. ఓ ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ (Former Minister Devineni Uma) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి, తుఫాన్ ప్రభావంతో అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయన్నారు. ఉల్లిపాయకి.. బంగాళాదుంపకి తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. 8 మంది కౌలు రైతులు చనిపోయారన్నారు. మూడు నెలల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీట మునిగిన పంటను చూడడానికి వెళ్తే తమ దగ్గరికి పోలీసులు వచ్చి ఫొటోలు తీస్తున్నారన్నారు. అప్పులు చేసి పంట వేస్తే నోటి దగ్గరకు వచ్చిన పంట నాశనం అయ్యిందన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు.

Updated Date - 2023-12-09T13:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising