ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. మంత్రి కొట్టుపై మహిధర్ రెడ్డి హాట్ కామెంట్స్

ABN, First Publish Date - 2023-09-26T13:25:47+05:30

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టాభూములు, ప్రైవేటు భూములను తీసుకువెళ్లి ఎండోమెంట్ భూములుగా సూచిస్తూ నమోదు చేయడంపై మహిధర్‌ రెడ్డి ప్రశ్నించారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై (Deputy CM Kottu Satyanarayana) మాజీ మంత్రి మహిధర్ రెడ్డి (Former Mahidhar Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టాభూములు, ప్రైవేటు భూములను తీసుకువెళ్లి ఎండోమెంట్ భూములుగా సూచిస్తూ నమోదు చేయడంపై మహిధర్‌ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి నెపాన్ని రెవెన్యూ వారిపై నెట్టడం దారుణమన్నారు. తరువాత ఎండోన్మెంట్‌లో ఓ కమిటీ పరిశీలిస్తుందని చెప్పడం దారుణమని.. త్రీమెన్ కమిటీ ఫోర్ మెన్ కమిటీ అంటే ఎలా అని ప్రశ్నించారు. గతంలో ఎండోమెంట్ భూములు దురాక్రమణ చేయడం చూశామని చెప్పారు. కందుకూరు నియోజకవర్గంలో ప్రైవేటు, పట్టా భూములను దేవాదాయ భూములుగా చూపుతూ దురాక్రమణ చేశారు అని భావిచాల్సి ఉంటుందన్నారు. 694.27 ఎకరాలలో ఎండోన్మెంట్‌కు ఉన్నది కేవలం 15 ఎకరాలు అని.. అయితే మొత్తం దేవాదాయ భూములుగా చూపడాన్ని మహిధర్ రెడ్డి తప్పుపట్టారు. ఇంత జరగుతున్నా డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సమాధానం భాద్యతారాహిత్యంగా చెప్పడం దారుణమన్నారు.


మంత్రి కొట్టు సత్యానాయారణ సమాధానం ఇస్తూ.. అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ల వద్ద ఆస్తుల జాబితాను తీసుకున్నామన్నారు. ఆ జాబితాలలో చాలా చోట్ల సబ్ డివిజన్ జరగకపోవడం వల్ల ఆ సర్వే నెంబర్ అంతా 22 ఏ 1సీ కింద పెట్టారని వివరించారు. అలా జరిగినప్పడు సబ్ డివిజన్ చేస్తే తప్ప ఈ భూములు విడదీయాలేమన్నారు. ఇవన్ని మహిధర్ రెడ్డికి తెలుసు అయితే ఆయన తన మీద ఎందుకో కోపంగా ఉన్నారని అన్నారు. ఇది పోరపాటుగా నమోదు చేసిన అధికారులపై చర్యలు కూడా తీసుకున్నామని.. సంజాయిషీ అడిగాం వారికి నోటీసులు కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. సబ్ డివిజన్ పూర్తయిన వెంటనే అన్ని తొలగించి ఆ భూములను సరిచేస్తామన్నారు. ఇలాంటి వాటి కోసమే చట్ట సవరణ కూడా చేసామని మంత్రి వివరణ ఇచ్చారు. వీలైనంత త్వరగా సబ్ డివిజన్ కాని చోట వాటిని రివెన్యూ డిపార్టెంట్‌తో మాట్లాడి సరిచేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.


మహిధర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి గారు త్వరగా పూర్తిచేస్తామన్నారు ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు రివెన్యూ మీదకు నెట్టితే ధర్మాన ఏమనుకుంటారని ప్రశ్నించారు. ‘‘మీకు దేవుడి భూములు మీద చిత్త శుద్ది లేదు.. మీరు చలివేంద్ర భూములు మీద ఎందుకు శ్రద్ధ వహించడం లేదు. సర్వేనెంబర్‌లో ఉండేది 10 సెంట్లు అయితే 100 ఎకరాలు రాసేసుకుంటే ఎలా. మీ హయాంలో ఇవి పూర్తవుతాయా లేదో మంత్రి చెప్పాలి’’ అని ప్రశ్నించారు.


మంత్రి కొట్టు స్పందిస్తూ.. మహిధర్ రెడ్డి కొన్ని అపోహలకు గురవుతున్నారన్నారు. తమ డిపార్మెంట్‌కు చెందిన అధికారులకు నోటీసులు ఇచ్చామని.. ఆయన కాలపరిమితి కోరుతున్నారని తెలిపారు. దీన్ని వీలున్నంత త్వరగా సరిచేస్తామని చెపుతున్నామని... టైం ఫ్రేమ్ అంటే చెప్పలేమని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-26T13:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising