Ganta: వైసీపీకి మాజీ మంత్రి గంటా సవాల్..
ABN, First Publish Date - 2023-12-01T18:04:40+05:30
నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదంటూ వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశామని నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు.
తిరుపతి: నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదంటూ వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశామని నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు. శ్రీకాళహస్తిలోని ఊరందూరు గ్రామంలో మీడియా సమావేశంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సవాల్‌ను వైసీపీ స్వీకరించాలని పిలుపునిచ్చారు.
"నాలుగన్నరేళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు విశాఖను, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ కళ్లబొల్లి మాటతో వైసీపీ ప్రయత్నం. రుషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండానే రాజకోట నిర్మాణం. పర్యాటక ప్రాంతమని ఒకసారి.. ఇంకోటని మరోసారి మాయమాటలు చెప్పి ఇప్పుడు సీఎం క్యాంపు కార్యాలయమని చెబుతున్నారు. ఆ రాజకోట రహస్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి రూ.450 కోట్లతో ముఖ్యమంత్రి తాత్కాలిక క్యాంపు కార్యాలయం నిర్మాణం చేస్తూ అందులో ఖరీదైన సామగ్రిని ఉపయోగిస్తున్నారు."అని మాజీ మంత్రి విమర్శించారు.
Updated Date - 2023-12-01T18:07:20+05:30 IST