ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: అబద్ధాలు చెప్పడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య

ABN, First Publish Date - 2023-11-18T17:24:09+05:30

వైసీపీ నేతలు సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మినట్లుగా నాసిరకం మద్యాన్ని కూడా అలానే అమ్ముతున్నారు. ఫుడ్ డోర్ డెలివరీ చేసినట్లు మద్యాన్ని కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Cm jagan) అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆరోపించారు. మద్యం అమ్మకాలు, నిషేధంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ‘‘రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది చనిపోయారు. చంద్రబాబు హయాంలో మద్యంపై కేవలం 50 వేల కోట్లు ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ధరలు పెంచడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గుతాయని చెప్పారు కానీ ఎక్కడ తగ్గలేదు. మద్యనిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి.. ఊరూవాడా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు.

‘‘వైసీపీ నేతలు సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మినట్లుగా నాసిరకం మద్యాన్ని కూడా అలానే అమ్ముతున్నారు. ఫుడ్ డోర్ డెలివరీ చేసినట్లు మద్యాన్ని కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తయారీ నుంచీ అమ్మకం వరకూ మొత్తం జగన్మోహన్ రెడ్డే చేయిస్తున్నారు. కల్తీ మద్యం తాగి గత నాలుగేళ్లలో 34 వేల మంది చనిపోయారు. మద్యం ద్వారా ప్రభుత్వ అధికారిక ఆదాయం రూ.1.14 లక్షల కోట్లయితే.. అనధికారికంగా జగన్ సొంత ఆదాయం మరో లక్ష కోట్లు. ధరలు పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారన్నది ఓ పిచ్చి వాదన. జగన్ పాలనలో ప్రతీ ఏటా మద్యం ధరలు పెరిగాయే కానీ ఎక్కడా తగ్గలేదు. మేనిఫెస్టోలో 30 శాతం హామీలు కూడా నెరవేర్చకుండా 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు. తెలుగుదేశం (TDP) అధికారంలోకి రాగానే నాణ్యమైన పాత బ్రాండ్ లన్నీ అందుబాటులోకి తెచ్చి ధరల్ని నియంత్రిస్తాం.’’ అని వెల్లడించారు.

Updated Date - 2023-11-18T17:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising