Ramgopal Varma: రాంగోపాల్‌వర్మకి బిగ్ షాక్
ABN, Publish Date - Dec 22 , 2023 | 10:56 PM
దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు.
అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు. పిటీషన్‌పై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణను వాయిదా వేసింది. వ్యూహ్యం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన రిట్ పిటీషన్‌పై ఈ నెల 26వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నది. సినిమాకు సంబంధించిన పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని లోకేష్ పిటీషనలో పేర్కొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 10:56 PM