ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP CID: సీఎంపై అసభ్య పోస్టులు పెడితే ఆస్తులు అటాచ్ చేస్తాం

ABN, First Publish Date - 2023-11-08T17:07:08+05:30

సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి

అమరావతి: ఏపీ సీఎం జగన్ (CM Jagan), కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్‌ (AP CID Chief Sanjay) హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టామని చెప్పారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని.. నిందితుల ఆస్తులు కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపైనా కూడా చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్నింటిని గుర్తించి తొలగించామన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.

సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. 202 సోషల్ మీడియా అకౌంట్స్‌ను మానిటరింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్‌ గుర్తించామని.. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2,972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేసినట్లు సీఐడీ చీఫ్‌ సంజయ్‌ వెల్లడించారు.

Updated Date - 2023-11-08T17:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising