ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattipati Pullarao: ‘151 ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని ప్రకటించే దమ్ముందా జగన్ రెడ్డి’

ABN, First Publish Date - 2023-03-03T14:08:02+05:30

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పల్నాడు: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు (Former Minister Pattipati Pullarao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 151 ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని ప్రకటించే దమ్ము జగన్ రెడ్డి (AP CM)కి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ (TDP)తో పొత్తుకు చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. జగన్‌ (Jagan Reddy) కు దైర్యం ఉంటే ఉద్యోగుల జీతాలు ఒకటవ తారీఖున ఇవ్వాలన్నారు. వైసీపీ (YCP)కి దమ్ముంటే ఇప్పడు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు దగా కేంద్రలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మంత్రుల హడావుడి పర్యటన తప్ప రైతులకు ఓరిగిందెమిలేదన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు దోచుకున్నారని.. టిడ్కో ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. పేదవారికి జగన్ ప్రభుత్వం (Jagan Government) గుదిబండగా తయారైందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పేదవారు బ్రతకలేని పరిస్థితి ఉందని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

కాగా.. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటిరిగా పోటీ చేస్తామని.. ఇతర పార్టీలు కూడా ఒంటిరిగా పోటీచేయాల్సిందే అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి వింత డిమాండ్‌‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇటీవల గుంటూరు జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సవాళ్లు విసిరారు. ‘‘దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులపై నేను ఆధారపడ్డాను. అందుకే భయం లేకుండా 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతున్నా. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా? వాళ్లకు ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు వాళ్లు మంచి చేసిన దాఖలాలే లేవు. ప్రజలకు మేలు చేశానన్న నమ్మకం, ధైర్యం ఉంది కాబట్టే అన్నీ స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో దుష్టచతుష్టయం చేసే కుట్రలు, అన్యాయాలు ఇంకా పెరుగుతాయని, ప్రజలు అన్నీ గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని జగన్‌ అన్నారు. మంచి జరిగిందా లేదా అన్నదే ప్రామాణికంగా తీసుకోవాలని, మంచి జరిగితేనే తనకు అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు.

Updated Date - 2023-03-03T14:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!