Kanna laxminarayana: బీజేపీకి గుడ్‌బై ఎందుకు చెప్పారో కారణాలు బయటపెట్టిన కన్నా
ABN, First Publish Date - 2023-02-16T12:42:46+05:30
పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెరదించేశారు.
గుంటూరు: పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ (Former President of AP BJP Kanna Lakshminarayana) తెరదించేశారు. కాసేపటి క్రితమే బీజేపీ (BJP)కి కన్నా (Kanna) గుడ్‌బై చెప్పేశారు. రాజీమానా లేఖ కూడా బీజేపీ అధిష్టానానికి పంపించేశారు. అయితే బీజేపీకి రాజీనామా చేయడానికి గల కారణాలను కన్నా మీడియా (Media)కు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (BJP State President Somuveerraju)పై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమువీర్రాజు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
2014లో మోదీ (PM Modi) నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. 2019లో అభ్యర్థుల ఎంపిక
(Selection of candidates)లో కీలకంగా వ్యవహరించానని... మోదీ (Narendra Modi) నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ‘‘నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ఏకతాటిపై నడిపాను.. సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయింది’’ అని అన్నారు. సోమువీర్రాజు (Somuverraju) నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. కక్ష సాధింపులతో సోమువీర్రాజు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
పదవులు ఆశించి పనిచేయలేదు...
కాంగ్రెస్ (Congress)లో 40 ఏళ్లు పనిచేశానని... ఐదుగురు సీఎంల దగ్గర పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. పదవులు ఆశించి ఏ పార్టీలో పనిచేయలేదన్నారు. పని చేస్తున్నందున పదవులు అవే వచ్చాయని తెలిపారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని పోరాడానని.. ఆ ఉద్యమంలో జీవీఎల్ పాల్గొని ఉంటే బాగుండేదని కన్నా అభిప్రాయపడ్డారు.
ఈరోజు ఉదయం ముఖ్య అనుచరులతో భేటీ అనంతరం కన్నా రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డాకు కన్నా తన రాజీనామా లేఖను పంపించారు. కన్నాతో పాటు 15మంది అనుచరులు పార్టీకి రాజీనామా చేశారు.
Updated Date - 2023-02-16T13:38:01+05:30 IST