ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Leaders: రేపు పల్నాడు జిల్లాలోకి యువగళం ఎంట్రీ.. ప్రభంజనం సృష్టించబోతుందన్న నేతలు

ABN, First Publish Date - 2023-07-31T14:32:17+05:30

ప్రాజెక్టులపై టీడీపీ వ్యయం చేసిన దాంట్లో 20 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. జగన్ కమీషన్లు దండుకొని బిల్లులను మంజూరు చేశారు. చంద్రబాబు ప్రాజెక్టులపై రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టారు.

పల్నాడు: పల్నాడు జిల్లాలో యువగళం జన ప్రభంజనం సృష్టించబోతుందని టీడీపీ నేతలు జీవీ. ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు పల్నాడులోకి యువగళం (YuvaGalam) ప్రవేశిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు, వేలాది మందితో ఘనస్వాగతం పలుకుతాం. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 7 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుంది. వైసీపీ పాలనలో ప్రాజెక్టులను పడకేయించారు. ప్రాజెక్టులపై టీడీపీ వ్యయం చేసిన దాంట్లో 20 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. జగన్ (Cm jagan) కమీషన్లు దండుకొని బిల్లులను మంజూరు చేశారు. చంద్రబాబు (Chandrababu) ప్రాజెక్టులపై రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టారు. తుది దశలో ఉన్న ప్రాజెక్టులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మార్గదర్శిపై జగన్ కక్షసాధింపులను తెలుగు వారంతా గమనిస్తున్నారు. మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని ఖాతాదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి ఆధారాలు, ఫిర్యాదు లేకపోయినా రామోజీరావుపై కేసు పెట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం.. సీఐడీని వాడుకోవడం ఆనవాయితీ అయిపోయింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించీ సీఐడీని వినియోగిస్తున్నారు. తప్పులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులు మూల్యం చెల్లించుకుంటారు.’’ అని నేతలు హెచ్చరించారు.

Updated Date - 2023-07-31T14:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising