ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Botsa:బైజూస్ సంస్థ ఉచితంగానే కంటెంట్ ఇస్తోంది

ABN, First Publish Date - 2023-10-12T18:26:14+05:30

బైజూస్ సంస్థ(Byjus Company) ఉచితంగానే కంటెంట్ ఇస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు.

అమరావతి: బైజూస్ సంస్థ(Byjus Company) ఉచితంగానే కంటెంట్ ఇస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు. గురువారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కొన్ని రాజకీయ పార్టీలు అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి. మాట్లాడే అంశాలు ప్రజలకు ఎంత ఉపయోగం అన్న విషయాన్ని బేరీజు వేసుకోవాలి. మా ప్రభుత్వ ప్రాధాన్యత విద్య. ఎన్ఈపీ అమలు కావొచ్చు, ఇతర అంశాలు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు ఉంటాయి.బైజుస్‌తో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు లేవు. 5.18 లక్షల ట్యాబ్‌లు 8 తరగతి విద్యార్థులకు ఇచ్చాం. ఈ ఏడాది మూడేళ్లకు సంబధించిన కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో పెడతాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో గందరగోళం సృష్టించ వద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నా. టోఫెల్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. సెలబ్రిటీ పార్టీగా ఉన్న ఓ రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు సరికాదు. ప్రైమరీ స్థాయిలో 6.30 లక్షల మందికి, జూనియర్ స్థాయిలో 14 లక్షల మందికి పరీక్షలు ఉంటాయి. ప్రస్తుతం ఒక్కో పరీక్షకు ఒక్కొక్కరికీ 7 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ నెల ఆఖరున జరిగే పరీక్షకు 600 రూపాయలు ఉంటుంది. 80 వేల మందికి ఈ తుది పరీక్ష జరుగుతుంది. 20 లక్షల మంది విద్యార్థులకు ఏటా 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్పేముంది. మాట్లాడే పరీక్షకు 2500 రూపాయల వ్యయం అవుతుంది. 2027 వరకూ అయ్యే ఖర్చు 145 కోట్లు. అప్పటి వరకూ మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంచాలని ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపుల్ల వేస్తున్నాయి. పాఠశాలల్లో బిగిస్తున్న ఐఎఫ్‌పీ ప్యానల్‌ను ఒక్కొక్కటి 1.25 లక్షల చొప్పున కొన్నాం. కొందరు నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

Updated Date - 2023-10-12T18:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising