TDP Vs YCP: ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. బాపట్లలో ఆసక్తికర రాజకీయం

ABN, First Publish Date - 2023-04-11T09:45:21+05:30

అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

TDP Vs YCP: ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. బాపట్లలో ఆసక్తికర రాజకీయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాపట్ల: అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. దళితులు, మైనార్టీల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former minister Nakka Anandbabu) విసిరిన చాలెంజ్‌ను మంత్రి మేరుగ నాగార్జున (Minister meruga Nagarjuna) స్వీకరించారు. వేమూరులో అభివృద్ధిపై, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కడే వచ్చిన సరే, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కొడుకును తెచ్చుకున్న సరే అని... తాను మాత్రం ఒక్కడినే వస్తానని అన్నారు. ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి మేరుగ స్పష్టం చేశారు.

meruga-nakka.jpg

దళితులు, మైనారిటీ సంక్షేమం - దాడులపై చర్చిద్దామని మంత్రికి నక్కా ఆనందబాబు (TDP Leader) సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి మేరుగ నాగార్జున (AP Minister) చర్చకు రావాలన్నారు. మంత్రి మేరుగ చేసిన దాడులు, దోపిడీ, మోసాలు నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇద్దరం సాంఘిక సంక్షేమశాఖకు మంత్రులుగా చేశామని, ఎవరెవరు ఏమేం చేశామో చర్చిద్దామా అంటూ టీడీపీ సవాల్ విసిరారు.

కాగా టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని, నియోజకవర్గంలో జగన్‌ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయని చెప్పారు. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు.

Updated Date - 2023-04-11T09:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising