కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Nageswara Rao: కేసీఆర్ ఏపీ అభివృద్ధిపై పచ్చి అబద్ధాలు చెపుతున్నారు

ABN, First Publish Date - 2023-11-03T19:36:02+05:30

లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) ఏపీ అభివృద్ధిపై అబద్ధాలు చెపుతున్నారని మంత్రి, కారుమూరి నాగేశ్వరరావు ( Minister, Karumuri Nageswara Rao ) అన్నారు.

Minister Nageswara Rao: కేసీఆర్ ఏపీ అభివృద్ధిపై పచ్చి అబద్ధాలు చెపుతున్నారు

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) ఏపీ అభివృద్ధిపై అబద్ధాలు చెపుతున్నారని మంత్రి, కారుమూరి నాగేశ్వరరావు ( Minister, Karumuri Nageswara Rao ) అన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ధనిక రాష్ట్రాన్ని తెలంగాణను వదిలి చంద్రబాబు వల్ల ఏపీకి వచ్చేశాం. కరోనా సమయంలో తెలంగాణ కన్నా ఏపీలో హాస్పిటలల్లో వైద్యం బాగా చేశారు అన్నారు. కేసీర్ తెలంగాణలో డబుల్ రోడ్ ఉంటే ....సింగిల్ రోడ్ వచ్చిందంటే ఏపీ అన్నారు. ధాన్యం సొమ్ము తాము కొనుగోలు చేసిన... ఒకటి రెండు రోజుల్లో రైతులకు నగదును అకౌంట్‌లలో వేశాము. ఏపీలో ఆలస్యం అవుతోంది అని కేసీఆర్ అబద్ధాలు చెపుతున్నారు. మేము ధాన్యం కొనుగోలులో ముందున్నాం. అదేదో ఏపీ ధాన్యం మొత్తం మీరు కొంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కరోనా సమయంలో ప్రజలను కేసీఆర్ గాలికి వదిలి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు. ఏపీలో కరోనాను ధీటుగా ఎదుర్కొన్నాం. తెలంగాణలో బడిపిల్లాలను ఏం చేశారు...ఏపీలో చదువులో విప్లవాత్మక మార్పు తెచ్చాం. ఏపీ చదువులో మూడో స్థానంలో ఉంది’’ అని మంత్రి, కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

వైసీపీ హయాంలో పేదరికం గణనీయంగా తగ్గింది: మంత్రి నాగేశ్వరరావు

‘‘హైదరాబాద్‌లో పిల్లలు నాళాల్లో పడి కొట్టుకు పోతుంటే ఏమి చేస్తున్నారు. ఏపీలో మా ప్రభుత్వం వచ్చాక పేదరికాన్ని గణనీయంగా తగ్గించేశాం. మీరు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తెస్తే ఉపయోగం ఉండదు. మా ధాన్యంకు మేమే 3 రోజుల్లో కొన్నాం. కొన్ని చోట్ల ఒక రోజుల్లోనే చెల్లింపులు చేశాం. మీ ఎన్నికల గురించి మీరు మాట్లాడుకొండి మా గురించి మీకెందుకు..? హైదరాబాద్ చుట్టూ పక్కల వాడుతున్న సన్నబియ్యం ఏపీ నుంచి కొనుక్కుంటున్నారు. ఏపీ ధాన్యం సన్నబియ్యం అంటే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. బీపీటీ, బాపట్ల మైసూర్ వంటివే తెలంగాణ మిల్లర్లు అదనంగా నగదు ఇచ్చి కొంటున్నారు. ఏపీలో 21 రోజులకే పేమెంట్ రాలేదు. అందుకే మేము కొంటున్నాం అని కేసీఆర్ అన్నారు అది పచ్చి అబద్దం. తెలంగాణ డబ్బున్న రాష్ట్రం ఏపీ ఇంకా గుడిసెనే.. ఐదేళ్లలో మేము రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నాం. ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అనుకుంటున్నాం ఇకనుంచి అక్కడ అబివృద్ధి చేస్తాం. తడిసిన ధాన్యం కూడా 1530 రూపాయలు ఎంఎస్పీ ఇప్పించడం వల్ల మిల్లర్లు నుక పెరిగి నష్టపోయారు. దువ్వలో రైతులు తడిసిన ధాన్యం కొనమని రోడ్డెక్కారు. దాన్ని తర్వాత మేమే కొన్నాం. మాకు అక్కడ ఆ రైతులే పాలభిషేకాలు చేశారు’’ అని కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-03T19:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising