MS RAJU: కంచికచర్ల దళిత యువకుడికి న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం
ABN, First Publish Date - 2023-11-04T21:33:38+05:30
కంచికచర్ల దళిత యువకుడికి న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత ఎమ్మెస్ రాజు ( MS RAJU ) అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా: కంచికచర్ల దళిత యువకుడికి న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత ఎమ్మెస్ రాజు ( MS RAJU ) అన్నారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత యవకుడికి న్యాయం చేయకపోతే చలో కంచికచర్లకు చేపడతాం. జగన్ ప్రభుత్వంలో దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దళితుల మీద దాడి జరిగితే ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ స్పందించలేదు. నిందితులను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దళిత యువకుడిపై దాడి చేసిన నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలని, 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెస్ రాజు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-11-04T21:34:22+05:30 IST