ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MT Krishnababu : సీహెచ్‌ఓలు వెంటనే ఆందోళన విరమించాలి

ABN, First Publish Date - 2023-11-28T19:02:02+05:30

సాధ్యం కాని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సీహెచ్‌ఓ ( CHO ), ఎంహెల్‌ఎచ్‌పీ ( MLHP ) లు వెంటనే విరమించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ( MT Krishnababu ) ఆదేశించారు. గ్రామీణ వైద్య సేవల కోసం ప్రభుత్వం 2019 నుంచి సీహెచ్‌ఓల నియమించిందని చెప్పారు. గ్రామ సచివాలయ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.

అమరావతి : సాధ్యం కాని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సీహెచ్‌ఓ ( CHO ), ఎంహెల్‌ఎచ్‌పీ ( MLHP ) లు వెంటనే విరమించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ( MT Krishnababu ) ఆదేశించారు. ఈసందర్భంగా కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ... గ్రామీణ వైద్య సేవల కోసం ప్రభుత్వం 2019 నుంచి సీహెచ్‌ఓల నియమించిందని చెప్పారు. గ్రామ సచివాలయ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ క్లినిక్‌లలో నియమితులైన సీహెచ్వోలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఏడాది కాంట్రాక్ట్‌పై నియమించామని చెప్పారు. వీరి నియామక సందర్భంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న వార్షిక ఒప్పంద షరతుల ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా జిల్లా ఆరోగ్య సమాఖ్య (District Health Society), వేతనాలను నిలుపు చేయడానికి అధికారం ఉందని స్పష్టం చేశారు.

అటు విధుల నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. సీహెచ్ఓలు కొన్ని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారని తెలిపారు. వార్షిక ఇంక్రిమెంట్ అందజేయాలని, ఏడాదికి 35 రోజులు సెలవులు మంజూరు చేయాలని సీహెచ్‌ఓలు కోరారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నందున సర్వీసులను రెగ్యూలరైజ్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. 13వ తేదీన విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నాను విరమించుకోవాలని సీహెచ్ఓలను కోరారు. సీహెచ్ఓలు విధులను నిర్లక్ష్యం చేస్తే వారిని తప్పించేందుకు కూడా వెనుకాడమని ఎంటీ కృష్ణబాబు హెచ్చరించారు.

Updated Date - 2023-11-28T19:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising