కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan : వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-12-01T17:05:14+05:30

వైసీపీ ( YCP ) కి భావజాలం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు.

Pawan Kalyan : వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: వైసీపీ ( YCP ) పార్టీకి భావజాలం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు. జనసేన, టీడీపీ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ...‘‘వైసీపీ వంటి పార్టీలకు ఈ పరిణామాలు ఇబ్బంది అనిపిస్తాయి. బీజేపీ, టీడీపీతో‌ ఎలా కలుస్తారని నన్ను అంటున్నారు. అసలు నన్ను విమర్శించే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలు క్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా తీసుకుంటాను. జనసేనకు యువతే పెద్ద బలం. రాష్ట్రంలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉంది. నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు. స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది. యువత ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.


యువత ధైర్యంగా పోరాడాలి

‘‘ఇతర రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు. జనసేన యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత వస్తున్నారు. నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తాను. నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు. స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది. యువత ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలి. ఏపీ భవిష్యత్తును ఒన నిర్ధిష్టమైన విధానంలో అభివృద్ధి పథంలో నడిపించాలి. ఏపీలో ఎన్నికల కోసం వంద రోజుల సమయమే ఉంది. మనం ప్రజల్లోకి వెళ్లాలి.జనసేన పార్టీ స్థాపించినప్పుడు గుండె ధైర్యం తప్ప నాతో ఎవరూ లేరు. జనసేనకు బలం మన యువతరం. రెండు కోట్ల లోపు బడ్జెట్‌తో నేను పార్టీ పెట్టాను.జనసేనకు 13వేల మందిగా ఉన్న యువత నేడు 6 లక్షలకు చేరారు. ప్రజలు నాకు ఇస్తున్న గౌరవంతో నాకు మరింత కృతజ్ఞత పెరుగుతుంది. సమస్యలు పట్ల స్పందించడమే నా‌ విధానం. సుగాలి ప్రీతి విషయంలో చాలా ఆవేదన చెందాను. పది మందికి డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా యువత తరలి వస్తున్నారు’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

తెలంగాణలో ఓటింగ్ శాతం చూసి బాధ కలిగింది

‘‘హైదరాబాద్‌లో అత్యల్ప ఓటింగ్‌ బాధాకరం. తెలంగాణ ఎన్నికల ఓటింగ్ శాతం చూసి బాధ కలిగించింది. బీజేపీ వంటి జాతీయ పార్టీ అధ్యక్షులు కూకట్‌పల్లిలో జనసేన కండువా కప్పుకుని ప్రచారం చేయడం ఆనందం కలిగించింది. జనసేనకు కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్న యువతను చూసి వారు ఆశ్చర్యపోయారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశాం.మాజీ‌ సీఎం కుమార్తె, సీఎం సోదరిగా ఉన్న వారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలపలేక పోయారు. తెలంగాణలో నేను పెద్దగా పర్యటనలు చేయలేదు. నా భావజాలం నచ్చి నాతో కలిసి యువత అడుగులు వేసింది. ఎనిమిది స్థానాల్లో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోటీ చేశారు. జనసేన ఐడియాలజీ నచ్చే వారు ముందుకు వచ్చారు.జనసేన అనేది వ్యక్తుల పార్టీ కాదు... భావజాలంతో నడిచే పార్టీ... ఇది‌ భవిష్యత్తులో తప్పకుండా కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం అన్న బీజేపీ జనసేనను మిత్ర పక్షంగా కలుపుకుంది’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-12-01T17:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising