కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: 2024లో టీడీపీ - జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం

ABN, First Publish Date - 2023-12-02T14:25:37+05:30

2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు. శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Pawan Kalyan: 2024లో టీడీపీ - జనసేన  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయడం ఖాయం

అమరావతి: 2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు. శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారు. 2019 నుంచి ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటే .. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వాళ్లమని.. కానీ ఇతర పార్టీల నుంచి నేను నాయకులను తీసుకోలేదని తెల్చిచెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచే దళిత సంఘాలు, బీసీల నాయకులతో తిరిగానని అన్నారు.

తెలంగాణలో రెండు ఎన్నికలు గెలిచిన బీఆర్ఎస్ ( BRS ) మూడో ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని చెప్పారు. వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు.కులాలకు కేటాయించి నిధులు అ కులాలకు వెళ్లడం లేదన్నారు. అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని తెలిపారు. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని అవమానాలు కూడా పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన మాట నెలబెట్టుకోలేనేమో అని అనుక్షణం భయపడ్డానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-12-02T14:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising