Purandeshwari: అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి లేదు..
ABN, First Publish Date - 2023-11-16T12:56:16+05:30
గుంటూరు: కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తోందని.. సీఎం జగన్ అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడంలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
గుంటూరు: కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి సాయం చేస్తోందని.. సీఎం జగన్ (CM Jagan) అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడంలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు (AP BJP Chief) పురందేశ్వరి (Purandeshwari) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆమె గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్జీ రంగా వర్సిటీ (NG Ranga University)లో పనులకు కేంద్రం నిధులు ఇచ్చిందని వర్సిటీ భవనాలకు, పరిశోధనలకు కేంద్రం నిధులు ఇచ్చిందని, అయినా ఎన్జీ రంగా వర్సిటీలో ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదని అన్నారు. ఎయిమ్స్ (AIIMS)కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని, యడ్లపాడు స్పైస్ పార్కు (Spice Park) అభివృద్ధి ఆగిపోయిందని పురందేశ్వరి విమర్శించారు.
Updated Date - 2023-11-16T12:56:18+05:30 IST