Rongali Appalaraju : జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయాం
ABN, First Publish Date - 2023-10-22T14:33:57+05:30
ఏపీలో ఉన్న ప్రతి సీపీఎస్ ఉద్యోగి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నమ్మి మోసపోయామనే భావనతో ఉన్నారని ఏపీసీపీఎస్ ఈఏ అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ( Rongali Appalaraju) అన్నారు.
అమరావతి: ఏపీలో ఉన్న ప్రతి సీపీఎస్ ఉద్యోగి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నమ్మి మోసపోయామనే భావనతో ఉన్నారని ఏపీసీపీఎస్ ఈఏ అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ( Rongali Appalaraju) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీని పక్కకు తోసి వైసీపీ ప్రభుత్వం వెంట నడిచినందుకు ఈరోజు బాధపడుతున్నాం. నాలుగున్నరేళ్లు అయ్యాక సీపీఎస్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రద్దు చేయలేదు. ఓపీఎస్ అమలు చేయకపోగా జీపీఎస్ పేరుతో మోసపూరిత విధానాన్ని జగన్‌రెడ్డి తెచ్చారు. జీపీఎస్ దేశంలో గొప్పదైన విధానమని అంటారు. అయితే ఈ బిల్లులో ఏముందో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎందుకు దొంగచాటుగా బిల్లు పెట్టారు. ముందుగా అందులో ఉన్న అంశాలను ఎందుకు మాకు చెప్పలేదని నిలదీశారు. ఏదో ఓ రోజు మాకు కూడా మంచి రోజులు వస్తాయి... ఆరోజు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింది. జగన్ వెంట నాడు నడిచినందుకు తీవ్రంగా బాధపడుతున్నాం. చాలామంది సీపీఎస్ ఉద్యోగులను జేఏసీలు, ప్రతిపక్షాలు, ప్రజలు హేలన చేస్తున్నారు.
ఉద్యోగులు ఆత్మగౌరవం వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల దెబ్బతిన్నది. అందుకే తాము ఆత్మగౌరవ సభలు పెట్టాలనుకుంటున్నాం. సీపీఎస్ రద్దు అయిపోయింది అంటున్నారు.. అయితే సీపీఎస్ కాంట్రిభ్యూషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సీపీఎస్ ఉద్యగుల భారీ బహిరంగ సభను నవంబర్ 19వ తేదీన చిత్తూరులో ఆత్మగౌరవ మహసభ పేరుతో ఏర్పాటు చేస్తున్నాము. డిసెంబర్ 10వ తేదీన అనకాపల్లిలో, డిసెంబర్ 17వ తేదీన ఒంగోలులో మహసభలు నిర్వహిస్తాం. డిసెంబర్ 24వ తేదీన రాజమహేంద్రవరంలో కూడా ఆత్మగౌరవ మహసభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభలకు సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున రావాలని కోరుతున్నాం. సీఎం జగన్ మాటలునమ్మి 5 సంవత్సారాలు జగన్‌రెడ్డి వెనుక తిరిగినందుకు జీపీఎస్ పేరుతో తమను మోసం చేశారు. జీపీఎస్ విధానాన్ని ఏ సీపీఎస్ ఉద్యోగి నమ్మె పరిస్థితిలో లేరు. జీపీఎస్ ఉన్నతమైనదని మీరు భావిస్తే ఎందుకు సీపీఎస్ ఉద్యోగులకు చెప్పడం లేదు. ఎందుకు బిల్లు పెట్టారు, ఎందుకు గవర్నర్ ఆమోదానికి పంపారు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని నిలదీశారు. తమకు చెప్పకుండా బిల్లుపెట్టేశారంటే అందులో ఏదో మతలబు ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వ చర్యలతో ఏపీలో ఉన్న సీపీఎస్ ఉద్యోగులు ఆత్మగౌరవం దెబ్బతిన్నదని రొంగలి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-22T14:33:57+05:30 IST