Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది
ABN, First Publish Date - 2023-11-01T16:51:23+05:30
వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు.
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు. ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan ) యోనెక్స్ , సన్ రైస్ ఆల్ ఇండియా సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ( Badminton Tournament ) ను సజ్జల రామకృష్ణరెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ...‘‘నవంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు టోర్నమెంట్ కొనసాగనున్నది. 3200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో నెల రోజుల పాటు క్రీడా సంబరాలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి ఈ టోర్నమెంట్‌లో ప్లేయర్స్ పాల్గొన్నారు. ఇలాంటి క్రీడపోటీల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించవచ్చు’’ అని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు.
క్రీడల్లో ఏపీ ముందుకెళ్తుంది: ద్వారకానాధ్
రాష్ట్రంలో క్రీడావిభాగంలో జరుగుతున్న అభివృద్ధిలో ఏపీ ముందుకెళ్తుంది అని బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాధ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడు అసోసియేషన్ మాత్రమే క్రీడా పోటీలు నిర్వహిస్తాయి.. కానీ ప్రభుత్వం ఈసారి నేరుగా క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. రానున్న రోజుల్లో క్రీడాల్లో ఏపీ దేశంలోనే తొలిస్థానంలో నిలుస్తుందని ద్వారకానాధ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-11-01T16:54:41+05:30 IST