ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: వినుకొండ ఘటన రాక్షస పాలనకు నిదర్శనం

ABN, First Publish Date - 2023-07-27T15:52:14+05:30

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం . రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే లక్ష్యంగా వైసీపీ నాయకులు, శ్రేణులు నిత్యం దాడులు, హత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

అమరావతి: వినుకొండలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడి అప్రజాస్వామికం అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం . రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే లక్ష్యంగా వైసీపీ నాయకులు, శ్రేణులు నిత్యం దాడులు, హత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడిలో 15మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోద్బలంతోనే ఈ దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న విషయాన్ని గమనించాలి. దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం రాక్షస పాలనకు నిదర్శనం. టీడీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. తక్షణమే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావాలి.’’ అని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-27T15:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising